వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు
కోరుకొండ, మేజర్ న్యూస్,తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలవాలే తప్ప, వేలంపాటల ద్వారా పదవులను దక్కించుకునే ప్రయత్నాలు కూటమి నేతలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కూటమి నేతలకు హితవు పలికారు. కోరుకొండ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలను ఎదుర్కోలేక సెలక్షన్ రాజకీయాలకు ఓటమినేతలు తెరలేపు తున్నారని విమర్శిం చారు.
ప్రజా వ్యతిరేకతతోనే వేలం పాటలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కూట మి ప్రభుత్వం ప్రజాస్వా మ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉందని రాజా విమర్శిం చారు. ఓటమి భయంతో ప్రత్యర్థులను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించ డం ద్వారా లొంగదీ సుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిం చారు.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమ న్నారు. ప్రజల విశ్వాసా న్ని కోల్పోయినందునే ఓట్లు అడిగే బదులు వేలంపాటల ద్వారా పదవులను దక్కించు కోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విలువ ఇవ్వ కుండా, సంతలో పశు వులను విక్రయించినట్లు పదవులను వేలం వేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి గ్రామం లోనూ ఇదే విధానం కొన సాగితే భవిష్యత్తులో డబ్బున్నవారికే రాజకీ యాల్లో అవకాశాలు దక్కుతాయని, సామా న్యులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
రెండున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారు?
కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వా త రాజానగరం నియోజక వర్గంలో ఉపాధి హామీ పనులు మినహా కొత్తగా ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారని రాజా ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులనైనా పూర్తి చేశారా అని నిలదీశారు.తమ ప్రభు త్వ హయాంలో సీతాన గరం నాలుగు లైన్ల రహ దారి నిర్మాణానికి రూ.100 కోట్లు వెచ్చించా మని, కోరుకొండలో అగ్ని మాపక కేంద్రం,అగ్రి ల్యాబ్, కోటకేశ్వరం, బొబ్బిలంక గ్రామాల్లో పీహెచ్‌సీల ఏర్పాటు, రఘుదేవపురంలో 30 పడకల ఆసుపత్రి, దివాన్ చెరువులో స్టేడియం మంజూరు వంటి పనులు చేపట్టామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ పనుల కు రూ.38 కోట్లు కేటా యించామని, గోదావరి జలాల శుద్ధి ద్వారా తాగు నీరు అందించే ప్రాజెక్టుకు రూ.215 కోట్లు మంజూరు చేయించామని పేర్కొన్నా రు. నియోజకవర్గంలో 20 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రెండు న్నరేళ్లలో పేదలకు ఇళ్లు, కొత్త పింఛన్లు అందించిం దా? ఆడబిడ్డ నిధి కింద రూ.1,500, నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని ప్రశ్నించారు.
రాజానగరం నియోజక వర్గంలో క్రికెట్ బెట్టింగ్‌లు, బూరుగుపూడిలో డెవిల్ పార్టీలు, భూపాలపట్నం లో డ్రగ్స్, సారా బెల్టు షాపులు, పేకాట క్లబ్బులు పెరిగాయని రాజా ఆరో పించారు. మద్యం దుకాణాల నుంచి వసూ ళ్లు, పోస్టుల నియామకా ల్లో లంచాలు, ప్రజల పను లు జరగాలన్నా చేతులు తడపాల్సిన పరిస్థితులు ఉన్నాయని విమర్శిం చారు
బుచ్చెంపేటలో రూ.16.50 లక్షల వేలం ;బుచ్చెంపేటలో ఎంపీటీసీ పదవిని శివాలయ నిర్మా ణం పేరుతో కొందరు వ్యక్తులు రూ.16.50 లక్షలకు దక్కించుకునే ప్రయత్నం చేశారని రాజా ఆరోపించారు. అదే గ్రామంలో ఎస్సీలకు చెందిన చర్చిలు కూడా ఉన్నాయని, ఒక ఆలయం పేరుతో పదవిని వేలం వేయడం ఎంతవ రకు సమంజసమని ప్రశ్నించారు. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాన్ని కల్పించే ఆయుధమని పేర్కొ న్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 117 ఆల యాల నిర్మించామ న్నారు.రంగరాయ దేవ స్థానం కోసం రూ.1.50 కోట్ల నిధులు తీసుకొచ్చా మని, కోరుకొండ ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధు లు సమకూర్చామని చెప్పారు.ఆలయాల అభి వృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేలం పాటల ద్వారా రాజకీయ పదవు లను దక్కించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
కార్యకర్తలను విస్మరించి డబ్బున్నవారికే పదవులా?
జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయ కులను పక్కన పెట్టి, బూరుగుపూడిలో పార్టీతో సంబంధంలేని వ్యక్తిని ఎంపీపీ అభ్యర్థిగా తీసుకొ చ్చారని రాజా విమర్శిం చారు. రాజకీయాల్లో కనీస సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు డబ్బు ఆధారంగా పదవులు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు.టీడీపీ, జన సేన పార్టీల్లో డబ్బే ప్రామా ణికంగా మారిందని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే తన బలమని, వారిని రాజకీయంగా నిలబెట్టేం దుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులపై దాడులు జరు గుతున్నప్పటికీ రాజా నగరం నియోజకవర్గంలో ఎదురొడ్డి పోరాటం చేస్తున్నామన్నారు.
బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చాం :తనపై బీసీలకు వ్యతిరేకం గా వ్యవహరిస్తున్నారం టూ చేస్తున్న దుష్ప్ర చారాన్ని రాజా ఖండిం చారు. పెరికి సామాజిక వర్గంపై తనకు, తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ సామా జిక వర్గానికి చెందిన నాయకుడికి కీలకమైన ఏఎంసీ పదవి ఇచ్చా మని, ఉండేశ్వరపురం సర్పంచ్‌కు స్టేట్ పెరికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కల్పించామని తెలిపారు. పెరిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని పేర్కొ న్నారు. ఈ వ్యవహారంలో తాను తొందరపడ్డ విష యం వాస్తవమేనని అంగీకరించారు.
మణికంఠ కుటుంబంపై ఒత్తిడి చేశారని ఆరోపణ
బుచ్చెంపేట వైఎస్సార్‌సీ పీ ఎంపీటీసీ అభ్యర్థి అన పర్తి మణికంఠ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీవీ ఆర్ చౌదరి కేసు పెడతా రా లేదా అంటూ ఒత్తిడి చేశారని రాజా ఆరోపిం చారు. తమ కుటుంబం తో ఉన్న అనుబంధం, అభిమానంతో కేసు పెట్ట లేమని మణికంఠ కుటుం బ సభ్యులు స్పష్టం చేశారని తెలిపారు.
తనతోపాటు పార్టీ నాయ కులపై కేసులు పెట్టేందుకు కూటమి నేతలు వీఆర్వో పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమ యంలో వేలంపాటలు నిర్వహించిన వారిపై ఎందుకు కేసులు నమో దు చేయలేదని ప్రశ్నిం చారు.
కేసులకు భయపడేది లేదు :ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో కేసులకు భయ పడేది లేదని రాజా స్పష్టం చేశారు. తన తండ్రి, మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహ నరావుపై 68 కేసులు ఉన్నాయని, తన తల్లి విజయలక్ష్మి నాలుగు సార్లు రిమాండ్‌కు వెళ్లా రని గుర్తుచేశారు. తనపై, తన సోదరుడు గణేష్‌పై కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తు న్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజా పోరాటాల్లో భాగంగా నమోదైన కేసులేనన్నారు.
బుచ్చెంపేటలో రాజ్యాంగ బద్ధంగా లభించిన ఓటు హక్కుతో ఎన్నికల బరిలో కి దిగి గెలవాలని కూటమి నేతలకు సూచించారు. రాజకీయ సంబంధాల కంటే వ్యక్తిగత అనుబం ధాలకే తమ కుటుంబం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. సీతానగరం మండలంలో జడ్పీటీసీ సభ్యురాలి భర్త సుజీ రాజు జనసేనలో చేరిన రెండు రోజుల్లోనే తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చా రని గుర్తుచేశారు.
బుచ్చెంపేట ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణి కంఠ, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న అనుబం ధంతోనే తనను కలిశా రని తెలిపారు. కార్యకర్తలే తన బలం, తన శక్తి అని రాజా స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ఎంసీ చైర్మన్ నక్క రాంబా బు, మండల పార్టీ అధ్య క్షుడు అడపా కనకరాజు, వైఎస్సార్‌సీపీ బీసీ విభా గం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కర్రీ నాగేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.