ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంసమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి ఐఏఎస్ తెలియజేశారు.ఆదివారం పి.గన్నవరం, అంబాజీపేట,అయినవిల్లి రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కార్యాలయాన్ని సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సన్నద్ధత, అధికారుల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ఏర్పాట్ల వివరాలను పరిశీలకురాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్దేశించిన విధివిధానాలను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వెంట ఉద్యాన శాఖ జెడి బి.రమణ, అయినవిల్లి, అంబాజీపేట,పి.గన్నవరం తహసిల్దార్ లు విద్యాపతి,బి. చిన్నబాబు, పి.శ్రీ పల్లవి,డిఎల్ డిఓ లు,ఎంపిడిఓ లు బి.మమత, జి.వి.సరోవరరావు, డిప్యూటీ ఎంపిడిఒ లు కె.శ్రీనివాస్, అబ్బాస్ ఆలీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.