BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

Select Suryaa Now
హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట పట్టణంలోని హడ్కో కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. జెడ్పీటీసీ అభ్యర్థి పంచిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ అభ్యర్థి తంగుడు అరుణ్ దీప్‌లకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. “మన ఓటు ఫ్యాన్ గుర్తుకే.. మన మద్దతు వైఎస్సార్‌సీపీకే!” అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కళింగ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, జిల్లా కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు తంగుడు జోగారావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కె.సి.హెచ్. గుప్తా, రాష్ట్ర కార్యదర్శి రఘుపాత్రిని శ్రీధర్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దండి జయప్రకాష్, మండల యువజన విభాగం అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు పొట్నూరు సాయి ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు నేతింటి రాజేశ్వరరావు, జిల్లా మహిళా కార్యదర్శి సవర శైలజ, మరువాడ సుధారాణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.