BREAKING
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? తెలుగుదేశం పార్టీలో చేరిన జొన్నాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజా రెడ్డి… 57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం

గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం

Select Suryaa Now
గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం

సూర్య - మానకొండూర్: మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) డైరెక్టర్‌గా గంగిపల్లి గ్రామానికి చెందిన ముక్కెర సతీష్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరుపొందిన ఆయన సేవలను గుర్తించి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా గంగిపల్లి గ్రామం నుంచి మానకొండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు నిర్వహించిన ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. సతీష్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, మడేల్ యూత్ సభ్యులు, రజక సంఘం నాయకులు, రైతులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ముక్కెర సతీష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమానికి, మార్కెట్ యార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.