BREAKING
డాక్టర్ షకీలా గెలుపు ఆత్మకూరు అభివృద్ధికి మలుపు భీమేశ్వరాలయంలో భక్తుల సందడి 27 నుండి జిల్లా లో తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉంది : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న దహన్ ది ఈవిల్ వితిన్.. భయానక థ్రిల్లర్‌ను వీక్షించారా! జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి తుమాటి కి నాయకుల మద్దతు పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా…. ఎంపీ గడ్డం వంశీకృష్ణ రక్తదానంతో ప్రాణదాతలుగా మారండి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నగరంలో 20 కి.మీ సైకిల్ ర్యాలీ తెలుగుదేశం కౌన్సిలర్ గా తుమ్మల 6వార్డు పిండి అమరావతి ప్రచారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు... చర్చిలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు 11 కేవీ విద్యుత్‌ వైరు తగిలి రైతు మృతి.. తమ్ముడికి గాయాలు పొన్న వాహనంపై దర్శనమిచ్చిన స్వామి ఆత్మకూరులో ఉధృతంగా తెలుగుదేశం పార్టీ

కలకడ న్యూస్

Select Suryaa Now
కలకడ  న్యూస్

 కలకడ ; కలకడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థి కలకడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోత్తూరి ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీ అభ్యర్థులు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు సమన్వయంతో ముందుకు సాగాలని, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థులు మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కలకడ మండల  అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని, గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.మండల పార్టీ అధ్యక్షుడు పోత్తూరి ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు ఒకే వేదికపై ఎమ్మెల్యేను కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సన్మానించారు. అనంతరం ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో కలకడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థి తదితరులు పాల్గొన్నారు.