BREAKING
హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పరీక్షను వాయిదా వెయ్యాలి... ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి స్విట్జర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు: మీరే తెలంగాణ నిజమైన సాంస్కృతిక రాయబారులంటూ ప్రశంసలు! యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు అరెస్ట్ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు ఘనంగా గరుడువాహన సేవ దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..! రాష్ట్రస్థాయి హాకి పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు -- తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సేవలు అద్భుతం

ఆత్మకూరులో ఉధృతంగా తెలుగుదేశం పార్టీ

Select Suryaa Now
ఆత్మకూరులో ఉధృతంగా తెలుగుదేశం పార్టీ

ఆత్మకూరులో ఉధృతంగా తెలుగుదేశం పార్టీ
--ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
--టీడీపీకి పెరుగుతున్న మద్దతు
➖ మంత్రి ఆనం సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు..

➖ మహిళా నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో మంత్రి ఆనం తనయ లీలా కైవల్య

➖  చేరికలతో సందడిగా మారిన రవితేజ కల్యాణ మండపంలోని ఎన్డీఏ కూటమి కార్యాలయం..

ఆత్మకూరు,మేజర్ న్యూస్, సోమావెంకటసుబ్బయ్య :

ఆత్మకూరు పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 
మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 
తమ ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలతో ఆత్మకూరు రవితేజ కల్యాణ మండపంలోని ఎన్డీఏ కూటమి కార్యాలయం సందడిగా మారింది.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు పలువురు నాయకులు ప్రకటిస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి మంత్రి ఆనం పసుపు కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.
మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ లీలా కైవల్య మహిళా నాయకులతో కలిసి ఆత్మకూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 
ఇంటింటికీ వెళ్లి మహిళలను, స్థానిక ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరుతూ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా సహా వివిధ వార్డుల కూటమి అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ పట్టణ అభివృద్ధికి సంబంధించిన తమ ప్రణాళికలను వివరిస్తున్నారు.
ఒకవైపు మంత్రి ఆనం సమక్షంలో రాజకీయ చేరికలు, మరోవైపు లీలా కైవల్య నేతృత్వంలో మహిళా నాయకుల విస్తృత ప్రచారం, ఇంకోవైపు వార్డు అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో ఆత్మకూరు పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.