BREAKING
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మెడికవర్ 10 కి.మీ. సైక్లోథాన్ ‘పెడల్ ఎగైనెస్ట్ క్యాన్సర్’తో ముందస్తు గుర్తింపుపై అవగాహన మల్లవరంలో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభం విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్ హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పరీక్షను వాయిదా వెయ్యాలి... ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి స్విట్జర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు: మీరే తెలంగాణ నిజమైన సాంస్కృతిక రాయబారులంటూ ప్రశంసలు! యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు అరెస్ట్ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు ఘనంగా గరుడువాహన సేవ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలి : బాపట్ల డీఎస్పీ

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలి : బాపట్ల డీఎస్పీ

పర్చూరు, మేజర్‌న్యూస్‌ : ఎం.పి.టి.సి, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బాపట్ల డీఎస్పీ సి.హెచ్‌ చంద్రమౌళి పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతుకట్ల , వీరన్నపాలెం, చెరుకూరు గ్రామాల్లో పర్యటించారు.  ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల పెద్దలతో మాట్లాడి, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్  బి. నాగభూషణం, పర్చూరు ఎస్‌ఐ  పి. అంకమ్మరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.