telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు
సూర్య, ఇల్లందకుంట : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, పోలీసు సిబ్బంది ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో, అలాగే సిరిసేడు చర్చిలో, మసీదులో ప్రార్థనలు నిర్వహించి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం, పోలీసు సిబ్బంది శ్రేయస్సు, ప్రజల భద్రత సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతికుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.