జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి తుమాటి కి నాయకుల మద్దతు
జడ్పీటీసీ టిడిపి అభ్యర్థి డాక్టర్ తూమాటి కి పలు పంచాయతీల నాయకుల మద్దతు
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండల జెడ్పిటిసి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డిని ఆదివారం పలుపంచాయతీలకు చెందిన నాయకులు కలిసి తమ మద్దతు తెలిపారు. వారు
ప్రచార కార్యక్రమంలో స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చలు జరిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా పలు పంచాయతీలకు చెందిన నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా పంచాయతీల నాయకులతో స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించే అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సమావేశం జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగానిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి,కరటంపాడు ఎంపిటిసి టిడిపి అభ్యర్థి దావా సుమన్య, నువ్వురుపాడుకు చెందిన టిడిపి యూనిట్ ఇంచార్జ్ కొండ్రెడ్డి రమణారెడ్డి, బి. చిరువెళ్ల మాజీ సర్పంచ్ కరేటి హాజరత్ రెడ్డి, నియోజకవర్గ టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ బాషా, సోమశిల ప్రాజెక్ట్ ఉత్తరకాలువ చైర్మన్ పూనుగుంట ధనుంజయ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ పూనుగుంట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.