6వార్డు పిండి అమరావతి ప్రచారం
6వ వార్డులో పిండి అమరావతి ప్రచారం జోరు...
ప్రచారంలో పాల్గొన్న జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్....
అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పిండి అమరావతి ప్రచారం జోరుగా సాగింది. వార్డులో ఆమె నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ఓటర్ల నుంచి స్పందన లభించింది. గతంలో ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమె వార్డు అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలతో ఉన్న పరిచయాలు, గతంలో చేసిన సేవలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, జనసేన పార్టీ నాయకుడు నల్లా శ్రీధర్ పాల్గొని ప్రజలను కలిశారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.
నల్లా శ్రీధర్ ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
*పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు*
ఈ సందర్భంగా పిండి రాజా మాట్లాడుతూ, 6వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తన తల్లి పిండి అమరావతికి అవకాశం కల్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అల్లాడ స్వామినాయుడు, మెట్ల రమణబాబు, నల్లా శ్రీధర్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గునిశెట్టి ఒలీ బాబా, గోకరకొండ లక్ష్మణరావు, పిండి శేషు, కల్వకొలను తాతాజీ, నల్ల చిట్టి, ఏడిద శ్రీను, అయితా బత్తుల కరుణ్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.