telangana
పొన్న వాహనంపై దర్శనమిచ్చిన స్వామి
సూర్య రాజన్న సిరిసిల్ల;;సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుండగా ఆదివారం రోజున రంగనాయక తిరుపొలం,పొన్న వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సిరిసిల్ల ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతుండగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రంగనాయక తిరుపోలంపై, పొన్నవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత తీర్పోలంపై ప్రతిష్టించి డబ్బు చప్పులతో దేవాలయ మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా స్వామి వారిని పలువురు భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నేటి రథోత్సవానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.