విజయారెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, భోజనం అందించిన మోహన్ యాదవ్
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: తమ ప్రియతమ నాయకురాలు పి. విజయారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా, జూబ్లీహిల్స్పి డివిజన్ యువనాయకులు మోహన్ యాదవ్ నాయకత్వంలో జూబ్లీ హిల్స్ డివిజన్‌లోని ఇందిరా నగర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లడ్డు రాజ్ యాదవ్, సత్తి గౌడ్, శివ గౌడ్, జూబ్లీ హిల్స్ డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు భవానీ బాబా గౌడ్; లక్ష్మీ రెడ్డి, సుకన్య, శంకర్, బాబ్లు యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్, పవన్ పటేల్, రామకృష్ణ, మహేశ్వర్, చింటు, వీర నరేష్‌లతో పాటు పలువురు ఇతర ప్రముఖ మద్దతుదారులు పాల్గొన్నారు.