భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 25: మహోన్నతమైన కళాకారుడు వెంపటి చిన్న సత్యం అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా కీర్తించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం 97వ జయంతి వేడుకల సందర్భంగా నిలిచిన ముద్రలు 7’ పేరిట సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోలేటి దామోదర్ గుప్తా పాల్గొని నాట్యకళా శేఖర డా. యలేశ్వరపు చలపతి శాస్త్రితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని భావితరాలకు అందించడంతో పాటు కళా రంగానికి వెంపటి చిన్న సత్యం చేసిన సేవలను స్మరించుకోవడం అభినందనీయమన్నారు.
భరత్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు లలితా రావు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో నాట్యకళా మయూరి డా. ఆర్. ప్రసన్న రాణి పాల్గొన్నారు. సభకు ముందు నాట్యాచార్యులు ప్రసాద్, నట్యచారిణి స్వేత ప్రియ, హరీష్మా రాయ్, వీణా శర్మ, సాయి గౌరీ, అవంతిక రామకృష్ణ, డా. కల్పనా నరెడ్ల, ప్రశాంతి వేమవరపు తదితర కళాకారులు శిష్య బృందాలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.