ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: త్వరలో జరగబోయే మహబూబ్ నగర్ -రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి పట్టభద్రులు తమ ఓటు తో కాంగ్రెస్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివా రం వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని చంద్రగిరికాలనీ నలందా స్కూల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియను ఆమె ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రతి పట్ట భ ద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఎంతో ఉందని, ఈ ఎన్నికలు వారికి ఓ మంచి అవకాశమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే బీజేపీ నాయకులకు, ఎన్నికలలో పట్టభద్రులు అండగా నిలిచి వారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉందని ఆమె అన్నారు. ఇచ్చిన హమీ లను తుంగలో తొక్కి, డైవర్షన్ పాలిట్రిక్స్ తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ పాలకులకు, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటుతో గట్టి సమాధానం చెప్పాలని క్యానం రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు దొమ్మాటి సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు ఓం ప్రకాష్, గోపాల్ యాదవ్, సంతోష్, శంకర్ యాదవ్, నరేంద్ర, విశాల్ తదితరులు పాల్గొన్నారు