తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది అలయ్ బలయ్ అని వక్తలు అన్నారు. ఉద్యమకారుడు జీవన్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్ పేట్ గౌడ సంఘంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పద్మా వెంకట్ రెడ్డి, డిపి పద్మావతి రెడ్డి, అమృత , తొలుపునూరి కృష్ణ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా గత మూడు సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భోజన వసతి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో దూసరి శ్రీనివాస్ గౌడ్, పులి జగన్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, మహేందర్ , చింతల కృష్ణ , కిషోర్ గౌడ్, సత్యనారాయణ, దిలీప్ కుమార్ నేత, మన్మోహన్ గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.