BREAKING
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Select Suryaa Now
వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : దేశ వ్యాప్తంగా వాసవి క్లబ్ సేవలు అభినందనీయ మనీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆదివారం హయత్ నగర్ లో నిర్వహించిన అల్లాడిస్ డిస్కౌన్ జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వైశ్య జాతికి చెందిన అనేక సంస్థలు వివిధ రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నాయని ఆయన వివరించారు సేవకు ప్రతిరూపంగా వైశ్యులు నిలుస్తారని ఆయన వెల్లడించారు 

సమాజహితం కోసం వైశ్యులు ముందుంటారని ప్రాంతాలు మతాలు కులాలు పట్టించు కోరని కేవలం సేవా దృక్పథం ఒకటే వారి ముందు ఉంటుందని ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు వివిధ రూపాల్లో వైశ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ సేవలు కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి సేవా సంస్థ చేసిన కృషి అభినందనీయమని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల కండగా నిలవడం గొప్ప విషయం అని తెలిపారు సమాజంలో సేవా భావాలను మరింతగా విస్తరించేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజోపయోగ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు కలసికట్టుగా పని చేద్దాం సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుదాం అనే నినాదంతో సదస్సు నిర్వహించడం వారి పరిణీతికి నిదర్శనమని శ్రీనివాస్ గుప్తా వివరించారు 

హయత్‌నగర్‌లోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సమీప నిధీష్ కన్వెన్షన్‌లో ఈ సదస్సు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యత, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో చేపడుతున్న కార్యక్రమాలను ప్రోత్సహించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశంగా నిలిచింది.ఈ కార్యక్రమానికి అల్లాడి ’స్ డిస్కన్ జిల్లా గవర్నర్, సద్గురు యోగాచార్య డాక్టర్ అల్లాడి పరమేశ్వర్ నాయకత్వం వహించగా, అంతర్జాతీయ అధ్యక్షుడు కేసీజీఫ్ సిద్ధ వెంకట సూర్య ప్రకాశరావు, ముఖ్య అతిథిగా అంతర్జాతీయ కోశాధికారి కేసీజీఫ్ వి.ఎస్. సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.  ఈ సదస్సులో బొగ్గారపు దయానంద్ గంప నాగేశ్వర్ రావు , చంద్రమౌళి , కృష్ణ రావు , పలువురు ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.