BREAKING
తెనుగుదేశం కు విజయం చేకూర్చాలి రూ.250 కోట్లతో వేగంగా 'దక్షిణ కాశీ' పునరుద్ధరణ రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి పలు తండాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి మేడిగడ్డ దాటితే నీళ్లన్నీ ఏపీకి వెళ్లవు! దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు కనిపించడం లేదా? కేటీఆర్‌ది తప్పుడు ప్రచారం: ప్రభుత్వ విప్‌ మేడిపల్లి సత్యం డాక్టర్ షకీలా గెలుపు ఆత్మకూరు అభివృద్ధికి మలుపు భీమేశ్వరాలయంలో భక్తుల సందడి 27 నుండి జిల్లా లో తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉంది : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న దహన్ ది ఈవిల్ వితిన్.. భయానక థ్రిల్లర్‌ను వీక్షించారా! జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి తుమాటి కి నాయకుల మద్దతు పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా…. ఎంపీ గడ్డం వంశీకృష్ణ రక్తదానంతో ప్రాణదాతలుగా మారండి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నగరంలో 20 కి.మీ సైకిల్ ర్యాలీ తెలుగుదేశం కౌన్సిలర్ గా తుమ్మల

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

Select Suryaa Now
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట :ఎటుచూసిన జనమే జనం.. అందరిలో భక్తిభావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే అనుభూతి.. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయ క్షేత్రం సొంతం.  ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు.ఆలయ పరిసరాలు జనసంద్రమైంది. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. చెక్ డ్యామ్, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీ పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు.
పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల్ల మధ్య బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు