telangana
రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి
సూర్య కరీంనగర్;;మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ హాజరయ్యారు.నూతన చైర్మన్‌గా రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆకుల నరసన్న పటేల్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.