BREAKING
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభం విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్ హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పరీక్షను వాయిదా వెయ్యాలి... ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి స్విట్జర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు: మీరే తెలంగాణ నిజమైన సాంస్కృతిక రాయబారులంటూ ప్రశంసలు! యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు అరెస్ట్ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు ఘనంగా గరుడువాహన సేవ దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..! రాష్ట్రస్థాయి హాకి పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక

తెనుగుదేశం కు విజయం చేకూర్చాలి

Select Suryaa Now
తెనుగుదేశం కు విజయం చేకూర్చాలి

తెలుగుదేశంకు విజయం చేకూర్చాలి 
--అభివృద్ధికి సహకరించాలి
--ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించాలి 
--టిడిపి యువనేత తారక్ నాథ్ రెడ్డి 
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్:ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ తల్లి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ షకీలాను, వార్డుల్లో కౌన్సిల్ అభ్యర్థులుగా టిడిపి, బిజెపి, జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అందరూ ఆదరించి సైకిల్ గుర్తుపై ఓట్లేసి విజయం చేకూర్చి అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం యువనేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి కోరారు. ఆయన ఆదివారం ఎనిమిదో వార్డులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ షకీలా,8వ వార్డు టిడిపి అభ్యర్థి మొబినాకు అందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తారక్ నాథ్ రెడ్డి స్థానిక దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ ఆయనకు మంగళహారతులతో శాలువాల సన్మానాలతో అఖండ స్వాగతం పలికారు. అనంతరం తారక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి కోసమే తన తల్లి డాక్టర్ షకీలా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, గత 40 సంవత్సరాలుగా తమ కుటుంబం ఆత్మకూరు పట్టణానికి,ఆత్మకూరు నియోజకవర్గానికి అందిస్తున్న ప్రజాసేవలు, సామాజిక సేవలను అందరూ గుర్తించాలని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేస్తున్న అభివృద్ధిని అందరూ గుర్తించాలని,తమ సేవలను కొనసాగించేలా సహకరించాలని తారక్ నాథ్ రెడ్డి కోరారు. ఆయన మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో కూడా ముమ్మరంగా  ప్రచారం సాగించగా అందరూ స్వాగతించి ఘనంగా సన్మానించి సంపూర్ణ మద్దతు తెలిపారు. 25 వ వార్డు టిడిపి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి డక్కా రమణమ్మ,చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి డాక్టర్ షకీలా లకు అందరూ ఓట్లువేసి ఘన విజయం చేకూర్చాలని తారక్ నాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ రేష్మ, తెలుగుదేశం నాయకుడు రబ్బాని, తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.