BREAKING
ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి

పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు

Select Suryaa Now
పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు

నవాబుపేట సూర్య న్యూస్:మండల పరిధిలోని యన్మన్‌గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-2000బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర క్షణాలను,నాటి అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఎన్నో ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకోవడంతో పాత స్నేహితుల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది.ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు.విద్యార్థి దశలో ఉపాధ్యాయులు అందించిన బోధనలు,క్రమశిక్షణ,విలువలు తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేసుకున్నారు.పాఠశాల రోజుల్లోని సరదా సంఘటనలను పంచుకుంటూ సందడి చేశారు.పాత స్నేహాలను మళ్లీ చిగురింపజేసుకున్న ఈ సమ్మేళనం అందరిలోనూ ఆనందాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు జానకిరామ్ రెడ్డి,లక్ష్మణ్,అర్జున్, రామలింగం,మల్లికార్జున్,సిద్ధిలింగం,రమాదేవి,జనార్ధన్‌ పూర్వ విద్యార్థులు గిరి,రాజు,నవీన్,ఖాదర్ పాషా,రాజు,మధుసూదన్,జైపాల్ తదితరులు పాల్గొన్నారు.