BREAKING
ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్. బాసరలో అలరించిన అష్టావధానం పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జల్‌.. జంగల్‌.. జమీన్‌ కోసం జంగు! శ్రీ హనుమాన్ ఆలయ అభివృద్ధి మందిర నిర్మాణానికి 1.50 లక్షల విరాళం అందించిన జిఎంఆర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీలక్ష్మి రాజేష్ ప్రచారం

తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

Select Suryaa Now
తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

కీసర, మేజర్ న్యూస్: కీసర మండల పరిధిలోని తిమ్మాయపల్లి రెవెన్యూ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కీసర ఎస్‌ఐ నాగరాజు సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు.దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.35 వేల నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కీసర సీఐ ఎన్. ఎలక్షన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలో పేకాట, అక్రమ జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. యువత, ప్రజలు జూదానికి దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.