BREAKING
ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్. బాసరలో అలరించిన అష్టావధానం పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జల్‌.. జంగల్‌.. జమీన్‌ కోసం జంగు! శ్రీ హనుమాన్ ఆలయ అభివృద్ధి మందిర నిర్మాణానికి 1.50 లక్షల విరాళం అందించిన జిఎంఆర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీలక్ష్మి రాజేష్ ప్రచారం

రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Select Suryaa Now
రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష

హాజరుకానున్న ఏఐసీసీ అబ్జర్వర్ మోహన్ కుమార్ మంగళం

పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపు

మొయినాబాద్, మేజర్ న్యూస్( అక్టోబర్ 25):

"అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేందుకు ఈ నెల 26వ తేదీ సోమవారం మొయినాబాద్‌లో జిల్లా స్థాయి సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

మొయినాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ మోహన్ కుమార్ మంగళం ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

అలాగే ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు మొయినాబాద్ మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొలిగిద్ద సత్యనారాయణ, ఏ. విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.