కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బలపరచాలని వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ తోటకూర సుబ్బరాజులు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆత్రేయపురంలో గ్రామంలో మదునూరి వెంకటరాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్ర రాజులు బలపరిచిన ఎంపీటీసీ -2 అభ్యర్థి ముదునూరి అనంతలక్ష్మి అప్పలరాజు కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు అలాగే ఉచ్చిలి గ్రామంలో కూటమి ఎంపిపి అభ్యర్థి తోటకూర సుబ్బరాజు ఎంపీటీసీ గా గెలిపించి గ్రామభివృద్ధికి సహకారం అందించాలని కొరారు. కూటమి బలపరిచిన అభ్యర్థులకు మండల పరిధిలోని 17గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను 19 ఎంపీటీసీ లను గెలిపించాలని కోరారు