BREAKING
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు

తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు *

Select Suryaa Now
తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం  * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు *

ఆమదాలవలస, సూర్య : తుఫాను, భారీ వర్షాల సూచనలు అందిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించి పంట నష్టాన్ని తగ్గించుకోవాలని ఆమదాలవలస మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కోత కోయాలన్నారు. పొలాల్లో మురుగు కాలువలు, గెడ్డలు శుభ్రపరిచి, నీరు బయటకు వెళ్లే మార్గాలను సిద్ధం చేసుకోవాలి. పంట కోత చేయాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే కోసి ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి, ఎత్తైన సురక్షిత ప్రదేశంలో భద్రపరచాలి.భారీ వర్షాల హెచ్చరిక ఉన్నప్పుడు ఎరువులు,పురుగుమందుల పిచికారీ నిలిపివేయాలి. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను తేమ చేరని సురక్షిత ప్రదేశంలో ఉంచాలి.నీటిని తోడే పంపులు, పైపులు, టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలి.తుఫాను సమయంలో పొలాల్లోకి వెళ్లకుండా, సురక్షిత ప్రదేశంలో ఉండాలి. తుఫాను అనంతరం పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపాలి. పంట నష్టం వాటిల్లితే ఫొటోలతో నమోదు చేసి, సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులకు సమాచారం అందించాలి. పంటల్లో తెగుళ్లు,  వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వ్యవసాయ అధికారుల సలహా మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించి పంటలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.