BREAKING
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు

అనంతవరం అభివృద్ధికి నా బాధ్యత : ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
అనంతవరం అభివృద్ధికి నా బాధ్యత : ఎమ్మెల్యే ఏలూరి

యద్దనపూడి, మేజర్‌న్యూస్‌ :
తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి, ఐకమత్యంతో పనిచేసి పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత ప్రాధాన్యం కల్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న నాయకుల సేవలను గుర్తిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న నిర్ణయానికి వెంకట్రావు సహకరిస్తుండటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయనకు తగిన ప్రాధాన్యం కల్పించేలా అందరినీ సమన్వయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నేనున్నా: గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని ఏలూరి సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అనంతవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని, ఈ బలాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, రానున్న ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయం అందించేలా పనిచేయాలని కోరారు. కార్యకర్తల ఐక్యతే తనకు బలమని పేర్కొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. పార్టీ శ్రేణులను  బాధ్యత నూటికి నూరు శాతం తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఏలూరిని కలిసిన వారిలో పెడవల్లి వెంకటరావు, సునీల్, మాజీ సర్పంచ్ షేక్ శీను, నాయకులు సాంబయ్య, నరేంద్ర,అఖిల్, తదితరులు ఉన్నారు.