BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు

Select Suryaa Now
స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో రెబల్స్ పోరుతో ప్రధాన పార్టీలకు ఇరకాటం తప్పడం లేదు. 13 ఎంపీటీసీ స్థానాలకు టిడిపి నుంచి 25, వైసిపి 36, జనసేన 5, కాంగ్రెస్ పార్టీ 2, బిజెపి 1, ఇండిపెండెంట్ 4 మంది అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. వీరిలో కూటమి తరపున జనసేన రెబల్స్, వైకాపా తరఫున ఇండిపెండెంట్ లు నామినేషన్లు వేయడంతో వారిని విత్ డ్రా చేసుకునేందుకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. దీంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ, బిజెపి నామినేషన్లు వేయడంతో ప్రధాన అభ్యర్థులకు గుబులు పుడుతుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. రెబల్స్ అభ్యర్థులను విత్ డ్రా చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కొన్ని ఓట్ల తేడాతో అవకాశం ఉన్నందున రెబల్స్ వలన గెలుపుపై ప్రభావం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస మండలంలో ఎన్నికల వేడి రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. ఎన్నికల బరిలో ఎక్కువమంది అభ్యర్థులు ఉన్నందున ఇబ్బందులు తప్పవని గ్రామాల్లో రహస్యంగా విత్ డ్రా ల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్లిష్టతర పరిస్థితుల్లో ఫైనల్ గా బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో వేచి చూడాల్సిందే.

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.