BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

Select Suryaa Now
టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

నరసన్నపేట, సూర్య : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో జలుమూరు మండలం అల్లాడ పంచాయతీ, పరిసర ప్రాంతాలకు చెందిన 156 కుటుంబాలు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య  పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం కల్పిస్తూ, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అల్లాడ పంచాయతీ పరిసర ప్రాంతాల నుంచి 156 కుటుంబాలు పార్టీలో చేరడం పట్ల స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మాన రామదాస్ గారు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.