BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

Select Suryaa Now
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

రామాయంపేట ; రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయడంతోపాటు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి డిమాండ్ చేశారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని ప్రగతి రిసార్టులో నిర్వహించిన రామాయంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నప్పటికీ జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో తీవ్ర జాప్యం జరగడం విచారకరమన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, పౌర సంబంధాల శాఖ మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే కేటాయించాలని రామాయంపేట వేదికగా మెదక్ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు శంకర్ దయాల్ చారి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల తరహాలో 55 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు లేదా 25 సంవత్సరాల పాటు వృత్తిలో కొనసాగిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఏ జర్నలిస్టుకు సమస్య ఎదురైనా తమ వంతుగా పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, భవిష్యత్తులోనూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు.రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఐదుసార్లు ఎన్నికైన బసన్నపల్లి మల్లేశంను ఈ సందర్భంగా శంకర్ దయాల్ చారి అభినందించారు. రామాయంపేట ప్రెస్ క్లబ్‌కు జిల్లా కమిటీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల ఐక్యతను కాపాడుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు డి.జి. శ్రీనివాస శర్మ మాట్లాడుతూ స్థానిక ప్రెస్ క్లబ్ ఎన్నికలు
ఏకగ్రీవంగా జరగడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా భవిష్యత్ లో జర్నలిస్ట్ ల సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా బసన్నపల్లి మల్లేశం, పటేరి రాము.ఆదివారం రామాయంపేట ప్రగతి రిసార్ట్ లో జరిగిన  రామాయంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బసన్నపల్లి మల్లేశం, (నవ తెలంగాణ )
ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము,(టీవీ9) కోశాధికారిగా రంగ రాజా కిషన్ (దిశ )
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రపు 
అమరేందర్ రెడ్డి,( సాక్షి)
డి.జి.శ్రీనివాస శర్మ, (సిరి) ఉపాధ్యక్షులుగా కర్రె నరేందర్,(RTV) తుజాల శ్రీనివాస్ గౌడ్,( విశాల నేత్రం ) సంయుక్త కార్యదర్శులుగా బొంతల సత్యనారాయణ, ( సాక్ష్యం)కుస్తీ నారాయణ ( నమస్తే తెలంగాణ)ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య (10 టీవీ )ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా మీడియా వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి రమేష్ గౌడ్, (సూర్య) కోశాధికారి వూడెం దేవరాజు(ప్రజాపక్షం ) లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.