BREAKING
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! రష్మిక మందన్న యాసపై విమర్శలు సరికాదు.. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు! ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు

ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు

Select Suryaa Now
ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు

పటాన్‌చెరు: ఇస్నాపూర్‌ కూడలిలో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలికను పటాన్‌చెరు పోలీసులు గుర్తించి, ఆమెకు సురక్షిత ఆశ్రయం కల్పించేలా చర్యలు చేపట్టారు. బాలిక భద్రత, సంరక్షణ, విద్య, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డిలోని బాల సదనానికి తరలించారు. బాలికకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, తగిన సంరక్షణ అందించాలని సంబంధిత అధికారులను కోరారు.అక్టోబర్‌ 24న ఇస్నాపూర్‌ కూడలి వద్ద ఓ బాలిక కనిపించినట్లు గుర్తుతెలియని వ్యక్తి డయల్‌ 112కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో ఉన్న బాలికను గుర్తించారు. అనంతరం ఆమె వివరాలను సేకరించారు.పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక పేరు సోని, తండ్రి నాగయ్య. ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం కాగా, ప్రస్తుతం సంగారెడ్డిలో నివసిస్తున్నట్లు వెల్లడించారు.బాలికకు రక్షణ, భద్రత కల్పించేందుకు మహిళా పోలీస్‌ సిబ్బంది ఎస్కార్ట్‌తో ఆమెను సంగారెడ్డి బాల సదనానికి తరలించారు. బాలికకు సురక్షితమైన వాతావరణంలో ఆశ్రయం కల్పించడంతో పాటు, ఆమె అవసరాలకు అనుగుణంగా విద్య, సంక్షేమం, ఇతర సౌకర్యాలు అందించాలని బాల సదనం అధికారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం బాలికకు అవసరమైన రక్షణ, సంరక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.