ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి సభ్యులుగా నామినేషన్లు వేసిన వారిలో ఆదివారం 9 మంది అబ్యర్థులు ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు తెలిపారు. నాగండ్ల తెలుగుదేశం పార్టీ ఎం.పి.టి.సి అభ్యర్థి గోరంట్ల సుధారాణి, గంగవరం తెలుగుదేశం పార్టీ ఎం.పిటి.సి అభ్యర్థులు కరి నాగేంద్రం, కరి వెంకటలక్ష్మీ, నాదెండ్ల శ్రీలక్ష్మి, కరి రామానుజమ్మ, భీమవరం ఎం.పి.టి.సి అభ్యర్థి గొల్ల చైతన్య, ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ నుండి షేక్ షాహీర్, వలేరు కుమారి, బెల్లం అరుణలు ఉపసంహరించుకున్నారన్నారని రమేష్‌బాబు వివరించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.