BREAKING
సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక! భవాని మందిరంలో హోమం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు.

నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం!

Select Suryaa Now
నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం!

సదాశివపేట;సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ పరిసరాల్లోని బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఉద్గారాలు, వ్యర్థాల వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసన కారణంగా గ్రామంలోని చిన్నారులు సహా ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయనే ఆందోళన కూడా గ్రామస్తుల్లో వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు.రాత్రింబవళ్లు కాలుష్య విష వాయువులు బయటకు..పరిశ్రమలో రాత్రి, పగలు తేడా లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, దట్టమైన పొగతో పాటు దుర్వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నందికంది జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించి, పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష వాయువులు పరిశీలించాలని కోరుతున్నారు.క్లోజింగ్ ఆర్డర్లపై అధికారుల వివరణ ఏది?బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమకు క్లోజింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ ఉత్తర్వుల వాస్తవ పరిస్థితిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని సర్పంచ్ కోరారు. అసలు ఉత్తర్వులు ఎప్పుడు జారీ అయ్యాయి? ప్రస్తుతం పరిశ్రమలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? కొనసాగితే అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.గత ప్రమాదాలపైనా విచారణ జరపాలి పరిశ్రమలో గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, కార్మికుల మరణాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై సంబంధిత శాఖలు రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని కోరుతున్నారు. కార్మికుల భద్రతా ప్రమాణాలు, గత ప్రమాదాల వివరాలు, బాధిత కుటుంబాలకు అందించిన పరిహారం తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కార్మికుల పట్ల యాజమాన్య వైఖరిపైనా ఆరోపణలు పరిశ్రమ యాజమాన్యం కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం స్పందన, సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.కాలుష్యంపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలి నందికంది గ్రామంలో గాలి నాణ్యత పరీక్షలు నిర్వహించడంతో పాటు పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఉద్గారాలు, వ్యర్థాల నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షించాలని సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి కోరారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధి, మూగజీవాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారా? కాలుష్య ఆరోపణలపై వాస్తవాలను వెల్లడిస్తారా? అన్నది వేచి చూడాలి.