BREAKING
సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక! భవాని మందిరంలో హోమం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు.

31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని

Select Suryaa Now
31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని

పటాన్ చెరు; గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ (2016-2020 బ్యాచ్) అసాధారణ ఘనతను సాధించింది. ఆమె మొత్తం 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించి ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నట్టు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.శివాలి, ఆమె తల్లిదండ్రులు కవితా శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి మరో కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు చేతితో తయారు చేసిన మూడు వేల కాగితపు బొమ్మల అతిపెద్ద ప్రదర్శన కోసం ను ఇటీవల అధికారికంగా అందుకున్నారు. దీంతో వారి కుటుంబం సాధించిన రికార్డుల సంఖ్య అపూర్వమైన 31కి చేరింది. ఈ ఘనతతో, భారతదేశంలో అత్యధిక గిన్నిస్ ప్రపంచ రికార్డులు కలిగిన వ్యక్తిగా శివాలి నిలిచారు.ఒరిగామి, పేపర్ ఆర్ట్ లో తన అసాధారణ ప్రతిభకు గుర్తింపు పొందిన శివాలి, సృజనాత్మకతను అంకితభావం, కచ్చితత్వం, పట్టుదలతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా మలిచారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఎంతో శ్రద్ధగా లక్షలాది కాగితపు కళాఖండాలను చేతితో రూపొందించి, వాటి కళాత్మక నైపుణ్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించారు.శ్రీవాస్తవ కుటుంబానికి ఈ విజయాలు కేవలం రికార్డుల కన్నా ఎంతో ఎక్కువ. సహనం, కళాత్మక అభిరుచి, కఠోర శ్రమ, కుటుంబ సహకార బలానికి నిదర్శనంగా వారి ప్రయాణం నిలుస్తుంది.ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు గీతం నాయకత్వం, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు శివాలికి,ఆమె కుటుంబానికి హృనదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కళ, ఆవిష్కరణ,సృజనాత్మకతల స్ఫూర్తిదాయక సమ్మేళనం ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తున్న ఆమె విజయాల పట్ల వర్సిటీ వర్గాలు ఎంతో గర్వపడుతున్నాయి. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.