BREAKING
అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Select Suryaa Now
అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

రామచంద్రాపురం;బీహెచ్ఈఎల్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్రను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఈ మహా పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడంలో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పట్ల అచంచలమైన భక్తిశ్రద్ధలతో చేపట్టే పాదయాత్ర భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని తెలిపారు.శబరిమల యాత్రను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో కొనసాగిస్తూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వామి మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.