ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: దివిసీమలో ఔట్‌ఫాల్ స్లూయిజుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలోని 13 ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి రూ.47.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్న సమస్యను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వారి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. స్లూయిజుల పునర్నిర్మాణంతో రైతులకు ఉప్పునీటి ముంపు సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.