BREAKING
అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? తెలుగుదేశం పార్టీలో చేరిన జొన్నాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజా రెడ్డి… 57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ

అభ్యర్థులు గెలిపే లక్ష్యం... -తిరునగరిలో కూటమి ప్రచార జోరు -అభివృద్ధికి పట్టం కడుతున్న కూటమికి అండగా నిలవాలి : జేబీ శ్రీనివాస్

Select Suryaa Now
అభ్యర్థులు గెలిపే లక్ష్యం... -తిరునగరిలో కూటమి ప్రచార జోరు  -అభివృద్ధికి పట్టం కడుతున్న కూటమికి అండగా నిలవాలి : జేబీ శ్రీనివాస్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తిరునగరిలో ప్రచార జోరు పెరిగింది. టీడీపీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో కలిసి ఆయా డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రచారంలో భాగంగా ఆదివారం 8, 9, 11, 12, 21, 61, 62, 63, 64, 65 డివిజన్లలో కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి డివిజన్ లో ప్రజలతో మమేకమై వారికి చేసిన సంక్షేమ, అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చేసే మంచిని వివరిస్తూ ముందుకు సాగారు. ఇందులో భాగంగా ఉదయం ప్రచారానికి వెళ్లిన మేయర్ అభ్యర్థితో పాటు కూటమి నాయకులకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. హారతులు పట్టి అన్నా మేమంతా మీ వెంటే ఉంటాం.. మీరు ముందుకు సాగాలని వీర తిలకం దిద్ది ముందుకు సాగనంపారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి, కూటమి ప్రభుత్వం ఓవైపు రాష్ట్రాన్ని, మరోవైపు తిరుపతి నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, అమరనాధ్ రెడ్డి, మురళీ మోహన్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర కార్యదర్శులు అన్నా అనిత, కుమారమ్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ లు.పులిగోరు మురళీ కృష్ణారెడ్డి, సురా సుధాకర్ రెడ్డి, సింగం శెట్టి సుబ్బరామయ్య, మన్యం శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్