BREAKING
అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? తెలుగుదేశం పార్టీలో చేరిన జొన్నాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజా రెడ్డి… 57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ

పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు!

Select Suryaa Now
పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు!

పెందుర్తి, సూర్య :  పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని రాజయ్యపేట ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎర్ర ఈశ్వరరావు తన అనుచరులు, పలు పార్టీల నాయకులతో కలిసి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. సుజాతనగర్ లోని క్యాంపు కార్యాలయంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ఎర్ర ఈశ్వరరావుతో పాటు దాదాపు 100 మంది కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చేరిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ పాత, కొత్త నాయకులు మరియు కార్యకర్తలందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. రాజయ్యపేట ఎంపీటీసీ స్థానం పరిధిలోని బొడ్డునాయుడుపాలెం, గోవిందపురం, ముదపాక, బంధవానిపాలెం, రాజయ్యపేట, రాయవరపువానిపాలెం, రాయవరం తదితర పంచాయతీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : నారాయణ, పెందుర్తి, విశాఖపట్నం.