BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు

Select Suryaa Now
నాలుగో పట్టణ పోలీసులు  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు

సీతమ్మధార, సూర్య :  నగరంలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలు నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా  పారదర్శకంగా నిర్వహించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా   పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నితమైన  సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగిందని నాలుగో పట్టణ సిఐ సిహెచ్ రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించడం, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు అని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు  రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఎన్నికల సందర్భంగా ఎటువంటి గొడవలు, ఘర్షణలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడరాదు అని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడరాదు అని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించడం చేయరాదు సంబంధిత అధికారుల అనుమతులు  అమలులో ఉన్న నిబంధనలను పాటించాలి అని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు, విద్వేషపూరిత ప్రచారం చేయరాదు. అటువంటి సమాచారాన్ని ధృవీకరించకుండా ఇతరులకు పంపరాదు అని తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసుల నిఘా ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి అని తెలిపారు.ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని తెలిపారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై చట్టప్రకారం నిఘా ఉంచి, అవసరమైన నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.