BREAKING
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! రష్మిక మందన్న యాసపై విమర్శలు సరికాదు.. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు! ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు

గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ

Select Suryaa Now
గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ

గాజువాక, సూర్య : జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. సీఐ చింతా వాసు నాయుడు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గాజువాక పోలీసులు, వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలకు సంబంధించి రవాణా శాఖ మరియు పోలీసుల నుంచి పొందిన అనుమతి పత్రాలు, మైక్ సెట్ల పర్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ప్రచారం నిర్వహించాలని, ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి వాహనాలను వినియోగించకూడదని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.