ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
అమీన్ పూర్;అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ పర్యటంలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించారు.ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా స్వామివార్లకు హరీష్ రావు ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.ఆలయ పండితులు వేదమంత్రాలు నడుమ ఆయనకు శేష వస్త్రాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చి వేద ఆశీర్వాదం అందజేశారు.అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.నందారం నరసింహ గౌడ్ నివాసంలో హరీష్ రావు ఆత్మీయ విందు..పర్యటన ముగించుకున్న అనంతరం అమీన్పూర్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ నివాసానికి హరీష్ రావు విచ్చేసి మధ్యాహ్న ఆత్మీయ భోజనం స్వీకరించారు.ప్రముఖ నేతల భాగస్వామ్యం, ఈ విందు కార్యక్రమంలో హరీష్ రావు తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగా రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.