BREAKING
అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం

Select Suryaa Now
మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం

జిన్నారం;బొల్లారం డివిజన్ పరిధిలోని కొత్త బస్టాండ్‌, వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఉన్న గాంధీనగర్‌ కాలనీ వ్యవస్థాపకులు, మాజీ వార్డు సభ్యులు స్వర్గీయ మల్లారెడ్డి 24వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ వార్డు సభ్యుడు, సీనియర్‌ నాయకుడు యాదిరెడ్డి మల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. బొల్లారం ప్రాంత అభివృద్ధికి మల్లారెడ్డి చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. గాంధీనగర్ కాలనీ అభివృద్ధికి పునాది వేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని యాదిరెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు భోజనం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. మల్లారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.