BREAKING
65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ప్రాంతీయ సంగీతానికి భాషా భేదాలు, సరిహద్దులు ఉండకూడదు: ప్రముఖ గాయని ఇషానీ దేవ్! నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి

Select Suryaa Now
వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి

వైసిపి అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి 
-రెండవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి 
-   వైసీపీ అభ్యర్థి సిరిసాల కుళ్లాయమ్మకు ప్రజల నుంచి విశేష ఆదరణ 
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  అనంత నగర పాలక సంస్థ ఎన్నికలలో వైసిపి మేయర్ అభ్యర్థి సి రమేష్ గౌడ్, కార్పొరేటర్ల అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రెండవ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి సిరిసాల కుళ్లాయమ్మ  ఎన్నికల ప్రచారంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి సిరిసాల కుల్లాయమ్మలు ఇంటింటికి తిరుగుతూ... కరపత్రాలు పంపిణీ చేస్తూ.. డివిజన్ అభివృద్ధి, సమస్యలు పరిష్కారం కావాలంటే.  ఎన్నికల్లో  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను వారు అభ్యర్థించారు.  డివిజన్ లో.. ప్రజల నుంచి కూడా... వైసిపి ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా
గత  ఐదేళ్ల వైసిపి పాలనలో అప్పటి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని .. నిలబెట్టుకున్నారని, ప్రజల వద్దకే పాలన అందించారని,అభివృద్ధి, సంక్షేమ అమలుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలకు వివరించారు.  ముఖ్యంగా తల్లికి వందనం,  45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చేయూత కింద సంవత్సరానికి రూ.18,500, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు, చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందించి అండగా ప్రజలకు వారు వివరించారు. కానీ వైసిపి కంటే మెరుగైన అందిస్తామని సూపర్ సిక్స్ హామీలతో 2024 అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు... రెండున్నర సంవత్సరాలైనా హామీలను అమలు చేయలేదన్నారు. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి  మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని హామీ  ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరికైనా  అందించారా..  మహిళలను  కూటమి ప్రభుత్వం దగా చేసిందని వివరించారు.  గత వైసిపి పాలనలో..   ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన  ఏ విధంగా ఉందో..  పథకాలు.. ఏ విధంగా అమలు అయ్యాయో.. ప్రజలు పథకాలు ద్వారా ఎలా లబ్ది పొందారో .. ఆలోచన చేసి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అభ్యర్థి సిరి శాల కుల్లాయమ్మ  విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసిపి, సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.