స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ
ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అవగాహన
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 130 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు (ఏపీఓలు) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నాగ అనసూయ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధులు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ ఏవో వెంకటరమణయ్య, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.