కరువు మండలంగా ప్రకటించాలి
మునిపల్లి;మునిపల్లి మండలాన్ని కరువు ప్రతాంగా ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పిఎస్ఆర్ గార్డెన్ లో సర్పంచ్ లు, పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని రైతులు ప్రస్తుతం వ్యవసాయ సంక్షోభం ఎలినెనో ప్రభావం ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రధాన పంటలైన పత్తి, చెరుకు, మిర్చి పంటలు ప్రతికూల పరిస్థితుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. నాణ్యమైన 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతలతో పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతునాయని మండిపడ్డారు. ఎకరానికి రూ.25వేలు అందించాలి..!మండలంలోని వ్యవసాయ పరిస్థితులను ప్రభుత్వం తక్షణమే సమీక్షించి, పంటల నష్టం, సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను గుర్తించి, వారి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, వ్యవసాయాన్ని కొనసాగించగలిగేలా ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల తాజా మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, మాజీ ఎంపీపీ చంద్రయ్య,మండల మాజీ ప్రధాన కార్యదర్శి శశికుమార్, సర్పంచులు ఇర్ఫాన్ పటేల్, విఠల్, మల్లేశం, రమేష్, సంగమేశ్వర్, దయానంద్, రాజు, మండల నాయకులు గడ్డం భాస్కర్, మాజీ సర్పంచులు పైతర మొగులయ్య ,బాగయ్య, బక్కన్న, శంకరయ్య, శ్రీనివాస్ పాండు, మౌలానా,మొగలయ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.