ఆపదలో అండగా స్పీకర్.. మహేశ్వరి వైద్యానికి రూ.2.50 లక్షల సాయం
వికారాబాద్, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. ధారూర్ మండలం మైలారం తండాకు చెందిన మోహన్ నాయక్ కుమార్తె రామావత్ మహేశ్వరి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న స్పీకర్ వెంటనే స్పందించి, వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరినట్లు తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, ప్రజా ప్రభుత్వం ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు.తమ కుమార్తె వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోహన్ నాయక్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.