విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలకేంద్రమైన సిఎస్ పురంలోని మహిమాన్వితమైన అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం దేవస్థానం అర్చకులు శ్రీకృష్ణశర్మ ప్రత్యేక పూజలుచేసి స్వామివారిని అమ్మవారిని విశేష అలంకరణ చేశారు.ఈసంధర్భంగా ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృత ఫల అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో ప్రత్యేక అలంకరణలు చేశారు.అనంతరం అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. సోమవారం కావడంతో పట్టణ,పరిసర గ్రామాల ప్రజలు శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామిని దర్శించుకుని పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.