BREAKING
మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ 51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌పై నెట్టింట కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా? ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి

అనంత ఆంజనేయస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్

Select Suryaa Now
అనంత ఆంజనేయస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్
 సూర్య ఆర్మూర్ :ఆర్మూర్  మున్సిపాలిటీ పరిధిలో మామిడి పల్లి  అనంత ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో 77వ  స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం ఆవరణలో చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. పెరిగిన చెట్ల కొమ్మలు, పిచ్చిమొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. 9వ వార్డు  కౌన్సిలర్ పోచంపాడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన కాలనీలో ఉన్న ఆలయం  ఆవరణలో ఉన్న చెత్తా చదరాన్ని తొలగించడం ఎంతో సంతోషకర విషయం అన్నారు. ఇలాంటి  స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్న మహాత్మ  స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుని అభినందించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. తమ ఆలయం లో ఇలాంటి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సంస్థను వారు అభినందించారు. ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా77వ ఆదివారం మామిడి పల్లి లో అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో  ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి ప్రశాంత్, జర్నలిస్టు రమేష్,రాజ్ కుమార్,సుంకే నిశాంత్, యాదగిరి,ఆదిత్య, గుర్రం రాకేష్, డ్రైవింగ్ వేణు, సుమన్,కృషవర్ధన్,  రాజన్న, జంగిడి భోజన్న గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.