ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ...
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 52వార్డు క్రాంతి నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు కె.కె రాజు పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్దిని వరుదు కల్యాణి ని, 52వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సాడిపద్మా రెడ్డిని గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రి మురళి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, కె సుశీల, మరియు 52వార్డు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.