క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి
శ్రీకాకుళం, సూర్య : క్రీడాకారులు నిరంతర సాధనతో లక్ష్యాలను ఛేదించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి చల్లా జగదీష్ పిలుపునిచ్చారు. నగరంలోని హరీష్ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి షూటింగ్ ఎంపికల సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను సమానంగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీల్లో మోహిత్ కృష్ణ భాస్కర్, ఎం. త్రిలోచన్, ఎస్. లక్ష్మీ చేతన్, పి.రస్మిత, సిహెచ్ తమన్ రామ సాయి ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.టి. హరీష్ కుమార్, శిక్షకుడు మల్లారెడ్డి చక్రవర్తి పాల్గొని ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.