అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత
నరసన్నపేట, సూర్య : నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బి-ఫారాలను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థులు ప్రజలను కోరాలని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధించే దిశగా సమన్వయంతో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.