వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి
ఆమదాలవలస, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తెలిపారు. ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ పంచాయతీలో 19 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి చేరడంతో వారందరికీ ఆదివారం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే గ్రామాల్లో వైయస్సార్సీపీ వైపు ప్రజలు తమ మద్దతును తెలుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మ తొర్లాడ గ్రామంలో రాబోయే రోజుల్లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి బెండి గోవిందరావు, మాజీ ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్ మూర్తి, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ సోమరాజు జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.